" మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే ? మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ చనునే ? తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే ? కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
మరుగునే ? సాంద్ర నీహారములకు "
అని పోతనగారు భాగవతంలో చెప్పారు. ( అంటే : మందార మకరందాల తీపి చూసిన తుమ్మెద వుమ్మెత్త పూలను చేరుతుందా. ఆకాశ గంగా తరంగాలలో ఉయలులూగిన రాజహంస వాగులకూ వంకలకూ వెళ్తుందా ? తీయని మామిడి లేత చివుళ్ళను తిని పరవశించే కోయిల కొండ మల్లెలను కోరుతుందా ? పండు వెన్నెల బయళ్ళలో విహరించే చకోరం మంచు పొగలవైపు వెళ్తుందా ? " )
అలాగ :
"అంబుజోదర దివ్య పాదారవింద
చింత నామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు ? " అంటాడు. (భగవంతుని పాదాలను పూజించడంలో ఆనందాన్ని పొందే చిత్తానికి మరో ఆలోచన ఉంటుందా ? అని ఉపమానం. )
భగవంతునిపై మనసు ఉంచితే కలిగే ఆనందం ముందు మిగిలిన భౌతిక విషయాలన్నీ అల్పములని చెప్పడానికి పోతన అనుసరించిన శైలి అద్భుతం. తెలుగు వారి గుండెల్లో ఈ పద్యం చిరస్మరణీయంగా నిలిచి పోతుంది.
No comments:
Post a Comment