చిన్న కాగితం మీద నేను చాలా రోజుల క్రితం ఎప్పుడో రాసి దాచుకొన్నది . ఇప్పుడు చదువుతుంటే.. కొంచెం (చాలా ?) అపరిపక్వంగా వుంది. కాని ఇక్కడి పాఠకులతో పంచుకోవడానికి.
"ప్రేమ" ..!"ప్రవేశము లేదు " అనే అక్షరాలని అడ్డంగా వుంచుకుని హాయిగా స్పందిస్తోన్న నా హృదయంలోకి ఎలాగో చొచ్చుకు వచ్చి "నన్నెవ్వరూ ఆపలేరు" అంటూ స్మితహాసం చేసావు.నిజమే కాబోలు...జ్ఞాపకాల జ్ఞాపికలనూస్మితహాసాల స్మృతి ముద్రలనూమధురానుభూతుల సుస్పందనలనూ నాకు మి..గి..ల్చి..నా హృదయం ఆర్తిగా పిలుస్తున్నావినకుండా నువ్వు నిర్గమిస్తుంటే ఆపలేక పోయాను...నిజమే..నిన్నెవ్వరూ ఆపలేరు...! "
No comments:
Post a Comment